‘ధరల భారంతో సామాన్యుడి బడ్జెట్ ఛిన్నాభిన్నం’
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:18 AM
అధిక ధరలతో సామా న్యుడి బడ్జెట్ ఛిన్నాభిన్నంగా తయారైందని వైసీపీ నేత, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.
శ్రీకాకుళం అర్బన్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): అధిక ధరలతో సామా న్యుడి బడ్జెట్ ఛిన్నాభిన్నంగా తయారైందని వైసీపీ నేత, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఆదివారం తన నివాసంలో మీడి యాతో మాట్లాడుతూ ఇలా అన్నారు.. ‘ఒక సామాన్యుడు తన సంపా దనతో హాయిగా జీవించగలుగుతున్నాడా లేదా అన్నది కూడా ప్రభు త్వం పట్టించుకోవాల్సిన విషయం. ప్రస్తుతం ఏ వస్తువూ కొనలేని పరి స్థితి వాటిల్లింది. 2024 తర్వాత రాష్ట్రంలో నిత్యా వసరాల ధరలు పెరిగిపోయాయి. ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీయల్ ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టడానికి అవసరమైన ప్రపంచస్థాయి సదస్సులు పెడుతున్నారు. ఓ వైపు రూ.3 లక్షల కోట్లు అప్పులు చేశారు. పేదవాడి కన్నీరు తుడిచే ప్రయత్నం చేశా రా? మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్న ప్రభుత్వానికి, హామీ లు ఇచ్చి ప్రజలను మోసగించిన ప్రభుత్వానికి ఓటమి ద్వారానే మన అసమ్మతిని తెలియజేయాలని శ్రీకాకుళం పౌరు లందరికీ ఇదే విజ్ఞప్తి’ అని అన్నారు.