ప్రజల విశ్వాసాలతో బీజేపీ ఆడుకుంటోంది
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:59 PM
దేశ ప్రజల విశ్వాసాలు, నమ్మకాలతో బీజేపీ ఆడు కుంటోందని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు.
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి
అరసవల్లి, జూలై 15(ఆంధ్రజ్యోతి): దేశ ప్రజల విశ్వాసాలు, నమ్మకాలతో బీజేపీ ఆడు కుంటోందని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిరం నిర్మాణం, తదనం తరం భక్తుల నుంచి సేకరించిన విరాళాలు, కానుకల విషయంలో అక్రమాలకు పాల్పడిన రామతీర్థ క్షేత్ర ట్రస్టును ఎందుకు రద్దు చేయ లేదని ప్రశ్నించారు. అయోధ్యలో ఇన్ని అక్రమా లు జరిగినా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తక్షణం సీపీఐతో విచా రణ చేయించాలని డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డూ విషయంలో గోల చేసిన హిందువులు, సెక్యులరిస్టులు రాష్ట్రంలో ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. కార్యక్ర మంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, డా.రామ్మోహనరావు, నగర పార్టీ అధ్యక్షుడు రెల్ల సురేష్, నేతలు మంత్రి నర్సిం హమూర్తి, కేవీఎల్‌ఎస్ ఈశ్వరి, ఆబోతుల వెంక టనాయుడు, ఇజ్జురోతు రమణ, కోత మధుసూ దనరావు, డా.కె.గోపాలకృష్ణ పాల్గొన్నారు.