Share News

ప్రాణం తీసిన తేనెటీగలు

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:01 AM

తేనెటీగలు ఓ వ్యక్తి ప్రాణా లను తీశాయి. కంచిలి మండలం బైరెడ్లపుట్టుగ గ్రామానికి చెందిన బైరెడ్ల చిరంజీవి(50) అనే వ్యక్తి తేనెటీగల దాడిలో మృతి చెందాడు.

 ప్రాణం తీసిన తేనెటీగలు
చిరంజీవి(ఫైల్‌)

- దాడిలో ఒకరి మృతి

కవిటి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): తేనెటీగలు ఓ వ్యక్తి ప్రాణా లను తీశాయి. కంచిలి మండలం బైరెడ్లపుట్టుగ గ్రామానికి చెందిన బైరెడ్ల చిరంజీవి(50) అనే వ్యక్తి తేనెటీగల దాడిలో మృతి చెందాడు. చిరంజీవి తన ఇంటి వద్ద మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సమీపంలోని తోటకు వెళ్లాడు. ఆ తోటలో తేనేటీగలు గుంపుగా తిరుగుతూ ఒక్కసారిగా చిరంజీ విపై దాడి చేశాయి. ఆయన పరుగుపె డుతూ గ్రామానికి చేరుకున్నాడు. గ్రామ స్థుల సహాయంతో కుటుంబ సభ్యులు వెంటనే కవిటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందాడు. చిరంజీవికి భార్య దేవి, డిగ్రీ చదువుతున్న కుమారుడు కిరణ్‌, కుమార్తె కళ్యాణి ఉన్నారు. చిరంజీవి ట్రాక్టర్‌ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఆయన మృతితో పండుగపూట గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 14 , 2026 | 12:01 AM