బీసీ రిజర్వేషన్‌కు గొడ్డలి పార్టీ మోకాలడ్డు
ABN , Publish Date - Oct 03 , 2026 | 11:56 PM
బీసీ రిజర్వేష న్‌కు గొడ్డలి పార్టీ మోకాలడ్డుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం ఆయన తన క్యాంప్‌కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు.
- ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
పోలాకి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేష న్‌కు గొడ్డలి పార్టీ మోకాలడ్డుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం ఆయన తన క్యాంప్‌కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో శాసనసభలో ఎమ్మెల్యేలతోతీర్మానం చేయించి, ఉన్నతాధికారులకు పంపించారన్నారు. ఈ లోగా వైసీపీ నాయకులు కోర్డుకు వెళ్లి అడ్డుతగిలారని అన్నారు. స్థానిక ఎన్నికలు అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్ 34 శాతం వద్దని, సర్ ఓటర్ల సర్వే ప్రకారం ఎన్నికలు జరపవద్దని కోర్డుకు వెళ్లి అడ్డుకోవడం భావ్యం కాదన్నారు. బీసీలు ఆందోళన చెందవద్దని, రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుందని తెలిపారు.
వినతుల స్వీకరణ..
ఎమ్మెల్యే రమణమూర్తి తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పింఛన్, రేషన్‌కార్డు, ఇళ్లు కావాలని అర్జీలు వస్తున్నాయని, వీటన్నింటికంటే సమాజానికి ఉపకరించే అర్జీల పరిష్కారానికి కృషిచేస్తానని, వ్యక్తిగత అర్జీలకు రెండోప్రాధాన్యత ఇస్తానని ఆయన అన్నారు.
భూ సమస్యలు పరిష్కరిస్తాం
నరసన్నపేట, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రైతుల భూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం గోపాలపెంట గ్రామంలో రాజముద్రతో కూడిన కొత్తపట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు భూ యజమాని హక్కులను సరిగ్గా నిర్ధారించకపోవడంతో చిన్నచిన్న విభేదాలకు కారణం అవుతున్నాయన్నారు. వీటిని పరిష్కరించి ఎవరి నిర్దేశిత భూమి వారికి చెందేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పొందర కురాకుల కార్పొరేషన్ చైర్మన్ దామోదర నర్సింహులు, వంశధార డీసీ చైర్మన్ శిమ్మ చంద్రశేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు అడపా చంద్రశేఖర్, తహసీల్దార్ ఆర్.సత్యనారాయణ, డీటీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత
టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గోపాలపెంటకు చెందిన టీడీపీ కార్యకర్త సనపల బాలకృష్ణ కుటుంబానికి రూ.5లక్షలు చెక్కును శనివారం పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.