Share News

వెన్నుపోటుకు పేటెంట్‌ హక్కు గొడ్డలి పార్టీదే

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:51 PM

రాష్ట్రంలో వైసీపీ ఆవిర్భావం నుంచి వెన్ను పోటు రాజకీయాలు నడిపి వెన్నుపోటుకు పేటెంట్‌ హక్కుతో గొడ్డలి పార్టీగా అవతరిం చిందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

వెన్నుపోటుకు పేటెంట్‌ హక్కు గొడ్డలి పార్టీదే
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ ఆవిర్భావం నుంచి వెన్ను పోటు రాజకీయాలు నడిపి వెన్నుపోటుకు పేటెంట్‌ హక్కుతో గొడ్డలి పార్టీగా అవతరిం చిందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండ పంలో కూటమి ప్రభుత రెండేళ్ల విజయో త్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఆధ్వర్యంలో సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం జరుగు తోందన్నారు. నియోజకవర్గంతో పాటు మునిసి పాలిటీ పరిధిలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. వైసీపీ పాలన రివర్స్‌ గేర్‌లో పయనించి రాష్ట్రంలో అభివృద్ధి 60 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. సీఎం చంద్ర బాబు నాయుడు నేతృత్వం లో సూపర్‌సిక్స్‌ పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. అంతకుముందు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మంజూరైన పథకాలను లబ్ధిదారులకు అందజే శారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు టి.సుజాత, నాయకులు తాడేల రాజారావు, కె. సిద్దార్థ, ఎన్‌. రాజు, టి.చంద్ర శేఖర్‌, డాక్టర్‌ సుధాకర్‌, విజయ లక్ష్మి, వండాన మురళి, జనసేన కన్వీనర్‌ పి.రామ్మోహన్‌, నాలుగు మండలాల అధికారులు, కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 11:51 PM