ఉపాధ్యాయులపై దాడి దారుణం
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:24 AM
విజయవాడ శాప్ కార్యాల యం వద్ద డీఎస్సీ స్పోర్ట్ కోటాలో ఎంపికైన ఉపాధ్యాయులపై దాడి దారుణమని, దీనిని తీవ్రం గా ఖండిస్తున్నట్లు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విజయవాడ శాప్ కార్యాల యం వద్ద డీఎస్సీ స్పోర్ట్ కోటాలో ఎంపికైన ఉపాధ్యాయులపై దాడి దారుణమని, దీనిని తీవ్రం గా ఖండిస్తున్నట్లు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. గురు వారం టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ నాయకుల ఆదేశాతో గంజాయి స్మగ్లర్లు, రౌడీషీటర్లు, సంఘ విద్రోహ శక్తులను రంగంలోకి దించి ఉపాధ్యాయులపై దాడి చేయించడం దారుణమన్నారు. దాడి చేసిన వారితో పాటు సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవా లని కోరారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో కుట్ర లు, కుతంత్రాలు పన్నుతున్నారని, ప్రజలు వాటిని గమనించాలన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఒకే కుటుం బానికి చెందిన ఇద్దరు క్రీడాకారులకు ఉద్యో గాలొస్తో ఆయనకు ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. తాను 2025 ఏప్రిల్ 30న అడహాక్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యానని, అదే రోజు నేష నల్ ఫెడరేషన్ ఆఫ్ సాఫ్ట్‌బాల్ నుంచి తనకు అధి కారిక గుర్తింపు లభించిందన్నారు. శ్రీకాకుళం నుంచి స్పోర్ట్స్ కోటాలో ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని, రాజకీయ ప్రయోజనం కోసం ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడడం ప్రజాస్వా మ్య పద్ధతి కాదన్నారు. నాయకులు పీఎంజే బాబు, విబూది సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
‘అప్రమత్తంగా ఉండాలి’
ఆమదాలవలస, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): నాగావళి వంశధార నదుల పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. తుఫాన్ నేపథ్యంలో గురువారం టీడీపీ కార్యాలయం నుంచి నియోజకవర్గంలోని మండలాల అధి కారులతో ఫోన్‌లో సమీక్షించి సూచనలు చేశారు. నాలుగు మండలాలు, మునిసిపాలిటీ పరిధిలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.