రాహుల్‌గాంధీపై దాడి అప్రజాస్వామికం
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:18 AM
నీట్ పేపర్ల లీకేజీపై విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలుపుతున్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీపై దాడి, అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు తెలిపారు. గురువారం శ్రీకా కుళంలోని బాబూ జగజ్జీవన్‌రాం విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు.కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్, కేవీఎల్‌ఎస్ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అరసవల్లి, జూలై 23(ఆంధ్రజ్యోతి): నీట్ పేపర్ల లీకేజీపై విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలుపుతున్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీపై దాడి, అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు తెలిపారు. గురువారం శ్రీకా కుళంలోని బాబూ జగజ్జీవన్‌రాం విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు.కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్, కేవీఎల్‌ఎస్ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఫఆమదాలవలస, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు డిమాండ్‌చేశారు. గురువారం ఆమదాలవలసలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలి సిన నిరసన చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లఖినేని నారాయణ, దాలినాయుడు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో న్యాయవాదుల నిరసన
శ్రీకాకుళం లీగల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): నీట్ పేపర్ల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శ్రీకాకుళం జిల్లా కోర్టు న్యాయవాదులు గురువారం నిరసన తెలిపారు. తొలుత న్యాయవాదులు జిల్లా కోర్టు నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బార్ జాయింట్ సెక్రటరీ ఈశ్వరరావు రమణమూర్తి, శాంతారాం, కూనసన్యాసప్పడు, రమణమూ ర్తి, తేజేశ్వరరావు, భాస్కర్,మామిడిక్రాంతి, విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.