Share News

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై దాడియత్నం హేయం

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:22 AM

వైసీపీ నాయకుల డీఎన్‌ఏలోనే హింస ఉందని, నిస్వార్ధంగా వార్తలు అందిస్తున్న ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయాలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు ప్రయత్నించడం హేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై దాడియత్నం హేయం

- వైసీపీ నాయకుల డీఎన్‌ఏలోనే హింస

- పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుల డీఎన్‌ఏలోనే హింస ఉందని, నిస్వార్ధంగా వార్తలు అందిస్తున్న ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయాలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు ప్రయత్నించడం హేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో బుధవారం మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ హయాంలో మహిళలే టార్గెట్‌గా ఆ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో సభ్యసమాజమే సిగ్గుతో తలవంచుకుందన్నా రు. అమరావతి మహిళా రైతుల పట్ల దాష్టీకాన్ని ప్రద ర్శించారన్నారు. చివరకు తనపైనా అనుచిత వ్యాఖ్యలు చేసి సునకానందాన్ని పొందినప్పుడు మహిళలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇటువంటి దాడు లతో భయోత్పాతాన్ని సృష్టిస్తే ప్రభుత్వం చూస్తు ఊరుకోదని హెచ్చరించారు.

ఉన్నది ఉన్నట్లు చెప్పితే దాడులా?

నరసన్నపేట, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ చెప్పిన విధానాన్నే వైసీపీ నాయకులు అవలంభిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన ‘వీకెండ్‌ కామెంట్‌’లో చెప్పారు. దీన్ని జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు ‘ ఆంధ్రజ్యోతి’ కార్యాలయాలపై దాడులకు ప్రయత్నిస్తున్నారు.’ అని రాష్ట్ర కాళింగ, కురాకుల, పొందరి కులాల కార్పొరేషన్‌ల చైర్మన్లు రోణంకి కృష్ణంనాయుడు, దామోదర నర్సింహులు అన్నారు. బుధవారం స్థానిక ప్రజాసదన్‌లో కూటమి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ వీకెండ్‌ కార్యక్రమం ద్వారా వైసీపీ నాయకుల తీరును మాత్రమే చెప్పిందని, మహిళలను కించపరిచే విధంగా ఎటువంటి వ్యాఖ్యాలు చేయలేదని అన్నారు. గతంలో వైపీసీ నాయకులు మహిళలను కించపరిచేలా మాట్లాడారని, వాటిని మరిచి నేడు ధర్నాలు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నరసన్నపేటలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొందరు వైసీపీ నాయకులు అవినీతి చానళ్లలో లేనిపోని కూతలు కూస్తున్నారని, దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత ఉచిత ఇసుక విధానం అమలు అవుతుంటే కనీసం అవగాహన లేకుండా తప్పుడు ప్రచారాలు చేయడం తగదని అన్నారు. ఈ సమావేశంలో కోమటి సంఘం డైరెక్టర్‌ జామి వెంకట్రావు, వంశధార డీసీ కమిటీ చైర్మన్‌ మిరియపల్లి వెంకట అప్పలనాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు అడపా చంద్రశేఖర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ భైరి భాస్కరరావు, తెలుగు యువత అధ్యక్షుడు రావాడ గణపతిరావు, మాజీ సర్పంచ్‌ గొద్దు చిట్టిబాబు, గొలివి రామారావు పాల్గొన్నారు.

‘ఆంధ్రజ్యోతి’పై అక్కసుతో వైసీపీ నిరసన: రమేష్‌

సరుబుజ్జిలి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్ర జ్యోతి’ దినపత్రికపై అక్కసుతో వైసీపీ నిరసన చేపట్టడం నీచమైన చర్య అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదవలస రమేష్‌ అన్నారు. బుధవా రం సరుబుజ్జిలిలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మా ట్లాడారు. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత మావిగన్‌ పేరుతో జగన్‌ కొత్త డ్రామాకు తెరతీశారని, దీనిపై ప్రజాగ్రహం వ్యక్తంకావడంతో దానిని కప్పిపుచ్చుకోవడానికి ‘ఏబీఎన్‌-ఆంధ్ర జ్యోతి’ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో డైవ ర్షన్‌ పాలిటిక్స్‌ నడుపుతూ, వైసీపీని బతికించుకోవడం సైకో జగన్‌రెడ్డికి దినచర్యగా మారిందని విమర్శించారు. రాజకీయాలు చేయడమంటే రా ష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు సేవలు చేయడంతో పాటు మంచి తనాన్ని గుర్తింపుగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అంతేతప్ప ప్రజల పక్షాన నిలబడే పత్రికలు, చానళ్లపై ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టడాన్ని వైసీపీ విడనాడాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత సంపాదన ధ్యేయంగా పరిపాలన సాగించిన జగన్‌రెడ్డికి పత్రికా స్వేచ్ఛను హరించే హక్కును ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇటువంటి హేయమైన చర్యలను టీడీపీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Apr 09 , 2026 | 12:22 AM