Share News

పశుసంవర్ధకశాఖను బలోపేతం చేయాలి

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:06 AM

: జీరోవేకెన్సీ పాలసీ ద్వారా శాఖలో పోస్టులన్నీ భర్తీచేసి పశుసంవర్ధకశాఖను బలోపేతం చేయాలని ఏపీ వెటర్నరీ విద్యా ర్థుల గ్రాడ్యుయేట్ల సంఘం నాయకులు కోరారు.

  పశుసంవర్ధకశాఖను బలోపేతం చేయాలి
మామిడి గోవిందరావుకు వినతిపత్రాన్ని అందజేస్తున్న వెటర్నరీ విద్యార్ధులు గ్రాడ్యుయేట్‌ల సంఘ ప్రతినిధులు

పాతపట్నం, అక్టోబరు18(ఆంధ్రజ్యోతి): జీరోవేకెన్సీ పాలసీ ద్వారా శాఖలో పోస్టులన్నీ భర్తీచేసి పశుసంవర్ధకశాఖను బలోపేతం చేయాలని ఏపీ వెటర్నరీ విద్యా ర్థుల గ్రాడ్యుయేట్ల సంఘం నాయకులు కోరారు. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు నిరంతరాయంగా భర్తీచేయాలని డిమాండ్‌చేశారు. ఆదివారం పాతపట్నం క్యాంపు కా ర్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు తమ సమస్యలపై ఏపీవెటర్నరీ విద్యా ర్థుల గ్రాడ్యుయేట్ల సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా మా ట్లాడుతూ జీవో-52 నిబంధనల ప్రాప్తికి డిపార్ట్‌మెంట్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీప్రక్రియ నిరంతరాయంగా కొనసాగించాలని కోరారు. కాగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Updated Date - Oct 19 , 2026 | 12:06 AM