Share News

కూటమిదే పరిషత్‌

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:40 AM

Alliance dominates in MPP and Vice-MPP elections జిల్లాలో పరిషత్‌ పోరు ముగిసింది. జిల్లాలో 30 మండలాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు మండలాల వారీగా గురువారం ప్రిసైడింగ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. కేవలం శ్రీకాకుళం, గార మినహా... మిగిలిన 28 మండలాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకున్నారు. అంతటా కూటమి హవా కనిపించింది.

కూటమిదే పరిషత్‌
కోటబొమ్మాళి : ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులతో మంత్రి అచ్చెన్నాయుడు

  • ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికల్లో హవా

  • టీడీపీ-27, బీజేపీ అభ్యర్థి ఒకచోట గెలుపు

  • వైసీపీకి ఒక్కటీ దక్కని వైనం

  • గార, శ్రీకాకుళం ఎంపీపీ ఎన్నికలు వాయిదా

  • బూర్జలో పదవీకాలం ఇద్దరికి పంపకం

  • శ్రీకాకుళం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిషత్‌ పోరు ముగిసింది. జిల్లాలో 30 మండలాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు మండలాల వారీగా గురువారం ప్రిసైడింగ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. కేవలం శ్రీకాకుళం, గార మినహా... మిగిలిన 28 మండలాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకున్నారు. అంతటా కూటమి హవా కనిపించింది. మొత్తం 28 మండలాల్లో టీడీపీకి చెందిన 27 మంది, బీజేపీ నుంచి ఒకరు ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైస్‌ ఎంపీపీలంతా టీడీపీకు చెందినవారే. ఈ పరిషత్‌ పోరులో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కలేదు. ఎంపీటీసీలు చేతులెత్తి తమ మద్దతు పలికి ఎంపీపీలను ఎన్నుకున్నారు. అనంతరం ప్రిసైడింగ్‌, ఎంపీడీవో సమక్షంలో.. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు ఐదేళ్లపాటు పదవీకాలంలో కొనసాగనున్నారు.

  • బూర్జలో చెరిసగం

  • బూర్జ ఎంపీపీగా టీడీపీ నుంచి ఇద్దరు పోటీపడ్డారు. వారిద్దరినీ సంతృప్తి చేసేలా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి రెండున్నరేళ్ల కాలం పాటు బూర్జ ఎంపీపీగా అనెపు శ్రీదేవి పదవిలో ఉంటారు. ప్రస్తుతం వైస్‌ ఎంపీపీగా ఎంపికైన వావిలపల్లి సీతారాంబాబు... ఎంపీపీగా మిగిలిన రెండున్నరేళ్ల కాలం కొనసాగుతారు. ఈ ఒప్పందానికి ఇరువురి నాయకులు అంగీకరించారు.

  • కోరం లేక.. ఎన్నిక వాయిదా

  • గార, శ్రీకాకుళం మండలాల్లో కోరం లేక ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారంతోపాటు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా.. గారలో ఎంపీటీసీ సభ్యుల కోరం లేకపోవడంతో ఈ ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశామని ప్రిసైడింగ్‌ అధికారి డాక్టర్‌ బాలకృష్ణ, ఎంపీడీవో ఎస్‌.శ్రీనివాసులు తెలిపారు. శ్రీకాకుళంలో కూడా గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రత్యేక సమావేశానికి తగిన సంఖ్యలో సభ్యులు హాజరుకాకపోవడంతో కోరం లేకుండాపోయింది. దీనితో ఈ ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశామని ప్రిసైడింగ్‌ అధికారి వెల్లడించారు.

  • రణస్థలంలో టీడీపీ ఆశావహుల మధ్య పోటీ

  • రణస్థలం ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ రేపింది. టీడీపీలో ఇద్దరు ఆశావహుల మధ్య నెలకొన్న పోటీలో చివరకు రావాడ ఎంపీటీసీ సభ్యుడు లంక ప్రభాకర్‌ విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికలో ఆయనకు 13 మంది, కోష్ట ఎంపీటీసీ సభ్యుడు పిషిని జగన్నాథంనాయుడుకు 12 మంది మద్దతు లభించింది. మండలంలోని 25 ఎంపీటీసీ స్థానాలకు గాను కూటమి 15, వైసీపీ 9, ఇండిపెండెంట్‌ ఒక స్థానంలో గెలిచారు. అయితే ఎంపీపీ పదవి కోసం టీడీపీ నుంచి ప్రభాకర్‌, జగన్నాథం నాయుడు పోటీపడ్డారు. ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామ్‌ సమక్షంలో జరిగిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో వ్యవహారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, టీడీపీ అధిష్ఠానం వద్దకు వెళ్లింది. తొలుత ఎంపీపీ పదవిని బీజేపీకి కేటాయించినా.. ఎమ్మెల్యే చొరవతో ఆ పార్టీ అభ్యర్థులు పోటీకి దిగలేదు. దీంతో ఇద్దరు టీడీపీ సభ్యులు ఫ్రెండ్లీ పోటీకి దిగారు. ప్రభాకర్‌కు 12 మంది కూటమి సభ్యులు మద్దతివ్వగా, జగన్నాథంనాయుడుకు ఇద్దరు కూటమి సభ్యులతోపాటు 9 మంది వైసీపీ సభ్యులు అండగా నిలిచారు. దీంతో ప్రభాకర్‌ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి శ్రీనివాసరావు ఆయనతో ప్రమాణం చేయించారు. ఉపాధ్యక్షుడిగా పిన్నింటి భానోజినాయుడు ఎన్నికయ్యారు.

  • ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు వీరే...

  • ---------------------------------------------------

  • మండలం ఎంపీపీ వైస్‌ ఎంపీపీ

  • --------------------------------------------------------

  • ఆమదాలవలస తమ్మినేని భారతమ్మ వండాన శ్రీదేవి

  • బూర్జ అనెపు శ్రీదేవి వావిలపల్లి సీతారాంబాబు

  • ఎచ్చెర్ల బెండు రమాదేవి బల్లాడ అరుణ

  • జి.సిగడాం డర్రు రమణమ్మ కొంపెల్ల లక్ష్మి

  • జలుమూరు వెలమల భవానీ సనపల రమణమూర్తి

  • లావేరు ఇజ్జాడ శ్రీనివాసరావు(బీజేపీ) నడిమింటి రూపాకుమారి

  • నరసన్నపేట సిమ్మ లక్ష్మి మాధవి తాలాభక్తుల

  • పోలాకి ఎం.వెంకటప్పలనాయుడు కొరుకోల లత

  • పొందూరు సుధా కూన పి.రామకృష్ణారావు

  • రణస్థలం లంకా ప్రభాకరరావు పిన్నింటి వెంకటరావు

  • సరుబుజ్జిలి పి వెంకటరమణమూర్తి డోల ప్రభావతి

  • హిరమండలం పొగిరి బుచ్చిబాబు సాహుకారి మంగమ్మ

  • కోటబొమ్మాళి తర్ర రామకృష్ణ కల్లి యమునా రెడ్డి

  • కొత్తూరు టొంపల నాగమణి అగతమూడి అరుణకుమారి

  • ఎల్‌.ఎన్‌.పేట వెలమల సుగుణ అంపిల్లి రోహిణి

  • మెళియాపుట్టి బైరిసింగి దినకర్‌ సాలాన రోహిణి

  • నందిగాం పినకాన మోహిని బెండి రాణి

  • పాతపట్నం సీమ మీనాక్షి పైల ప్రియాంక

  • సంతబొమ్మాళి సుగ్గు శాంతిస్వరూప్‌ రెడ్డి కొర్రాయి అనసూయ

  • సారవకోట మరడ సంధ్య కోన వెంకటేశ్వరరావు

  • టెక్కలి బగాది రమాదేవి కోళ్ల కామేశ్వరరావు

  • చ్ఛాపురం మేరుగు సూర్యనారాయణ కాళ్ల నీలవేణి

  • కంచిలి మాదిన విమల పైల శారద

  • కవిటి సీపాన రాణి జయశ్రీ పట్నాయకుని

  • మందస బావన కూర్మావతి కొండపల్లి నారాయణరావు

  • పలాస కుత్తుమ రూపవతి పోలాకి శారద

  • సోంపేట సూరాడ జానకి రెల్ల జ్యోతి

  • వజ్రపుకొత్తూరు పుచ్ఛ శోభారాణి లండ శారద

  • -----------------------------------------------------------------------

  • లావేరు ఎంపీపీ(బీజేపీ) మినహా, మిగతా ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు అంతా టీడీపీకి చెందిన వారే.

Updated Date - Nov 20 , 2026 | 12:40 AM