Share News

కూటమి మళ్లీ అదుర్స్‌...

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:20 AM

TDP, Bjp, janasena wins all ZPTC elections సార్వత్రిక ఎన్నికల్లో మాదిరి.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జిల్లాప్రజలు కూటమికి జైకొట్టారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజీపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. ఆయా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. వైసీపీ అభ్యర్థులకు మాత్రం ఈ ఎన్నికల్లో పరాభవమే మిగిలింది.

కూటమి మళ్లీ అదుర్స్‌...
కోటబొమ్మాళి : గెలుపొందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో మంత్రి అచ్చెన్నాయుడు విజయచిహ్నం

  • పోటీ చేసిన అన్ని జడ్పీటీసీల్లో టీడీపీ విజయం

  • రెండుచోట్లే పోటీ చేసి గెలిచిన బీజేపీ

  • ఆరింటికి ఐదు స్థానాల్లో జనసేన గెలుపు

  • ఒక స్థానానికే పరిమితమైన వైసీపీ

  • మాజీమంత్రుల ఇలాకాలోనూ ఓటమి

  • ఎంపీటీసీ స్థానాల్లో అత్యధికం టీడీపీ కైవసం

  • గెలుపొందిన స్థానాలు ఇలా..

  • -------------------------------

  • పార్టీ జడ్పీటీసీ ఎంపీటీసీ

  • ------------------------------------

  • టీడీపీ 22 410

  • జనసేన 5 21

  • బీజేపీ 2 14

  • వైసీపీ 1 81

  • స్వతంత్ర 0 16

  • ==================

  • మొత్తం 30 542

  • ------------------------------------

  • శ్రీకాకుళం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో మాదిరి.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జిల్లాప్రజలు కూటమికి జైకొట్టారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజీపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. ఆయా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. వైసీపీ అభ్యర్థులకు మాత్రం ఈ ఎన్నికల్లో పరాభవమే మిగిలింది. మాజీమంత్రుల ఇలాకాల్లో సైతం ఓటమి తప్పలేదు. జిల్లాలో 30 జడ్పీటీసీ స్థానాలకు, 523 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 5న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. శనివారం శ్రీకాకుళం, టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్ల వారీ ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడించారు. జిల్లాలో 30 జడ్పీటీసీ స్థానాలకు కూటమిలో భాగంగా 22 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో నిలవగా.. అన్నిచోట్లా విజయం సాధించారు. జనసేన 6 స్థానాల్లో పోటీచేయగా... అతిస్వల్ప ఓట్ల తేడాతో.... ఇతర కుల సామాజిక వర్గాల తేడాతోనూ నరసన్నపేట జడ్పీటీసీ స్థానం వైసీపీకి వెళ్లిపోయింది. మిగిలిన ఐదు స్థానాల్లో జనసేన కైవసం చేసుకుంది. ఇక బీజేపీ కేవలం రెండు స్థానాల్లో పోటీ చేసి.. విజయం సాధించింది. వైసీపీ మొత్తం 30 స్థానాల్లో కేవలం ఒక స్థానానికే పరిమితమై పోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒకేఒక్క టీడీపీ జడ్పీటీసీ హిరమండలం నుంచి గెలుపొందారు. ఇప్పుడు వైసీపీకి ఒక జడ్పీటీసీ మాత్రమే ఉన్నారు. సీన్‌ రివర్స్‌ అయింది.

  • 523 ఎంపీటీసీ స్థానాలకు ...

  • జిల్లాలో 542 ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 19 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 523 స్థానాల్లో 1,248 మంది అభ్యర్థులు పోటీ చేశారు. టీడీపీ 410 (393+17 ఏకగ్రీవం) స్థానాలను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. వైసీపీ 81 స్థానాలకే పరిమితమైంది. జనసేన 74 చోట్ల పోటీచేసి 21 స్థానాల్లో గెలుపొందింది. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 107 చోట్ల పోటీచేసి 16 స్థానాల్లో విజయం సాధించారు. బీజేపీ 25 స్థానాల్లో పోటీచేసి 14 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్‌, బీఎస్పీ, బీసీవైపీ వంటి పార్టీల నుంచి అభ్యర్థులు పోటీలో నిలిచినా కనీస ప్రభావం చూపలేకపోయారు.

  • మాజీమంత్రుల ఇలాకాలోనూ వైసీపీ గల్లంతు...

  • మాజీస్పీకర్‌ తమ్మినేని సీతారాం సొంత మండలం ఆమదాలవలసలో వైసీపీ ప్రభావం కోల్పోయింది. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌ స్వగ్రామం మబుగాంలో ఎంపీటీసీ అభ్యర్థి అతికొద్ది మెజార్టీతో గెలుపొందారు. నరసన్నపేట జడ్పీటీసీ వైసీపీ పరం కావడానికి ఇతరుల సహకారం కూడా లభించింది. జనసేన అభ్యర్థి పట్ల.. కుల సామాజికపరంగానూ మేజర్‌ కమ్యూనిటీ ఈవిషయంలో ఒకటైందని విశ్వసనీయ సమాచారం. అలాగే సీదిరి అప్పలరాజు స్వగ్రామం దేవునల్తాడ, మాజీ జడ్పీచైర్‌పర్సన్‌ పిరియా విజయ.. సొంత మండలాల్లో సైతం టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీరాలపోయిన నాయకులందరికీ స్థానిక ప్రజలు కూటమికి ఓట్లతో జే కొట్టి.. వైసీపీకి ఇప్పట్లో కనికరించేదిలేదని సంకేతాలు ఇచ్చారు.

  • ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు

  • శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ స్వగ్రామం కిష్టప్పపేటలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ నాడే వైసీపీ నాయకులు, అనుచరులు అరాచకం సృష్టించారు. ఎమ్మెల్యేపైనే దాడికి యత్నించారు. కాగా.. శనివారం ఓట్ల లెక్కింపు రోజు కూడా కాస్త హడావుడి చేశారు. ఓట్ల లెక్కింపు అనంతరం.. సింగుపురం-2 ఎంపీటీసీ పరిధిలో స్వల్ప మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. ఈ విషయంలో అనుమానాలున్నాయని.. రీకౌంటింగ్‌ నిర్వహించాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ను టీడీపీ అనుచరులు కోరారు. అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. మరోవైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా రీకౌంటింగ్‌ చేస్తే మరింత మెజార్టీ వచ్చేస్తుందని అనుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే స్వగ్రామంలో వైసీపీ గెలుచుకున్నామని చెప్పుకునేందుకు బాగుంటుందని ఆశపడ్డారు. కాగా రీకౌంటింగ్‌ చేయగా.. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరసవల్లి లక్ష్మీదేవి.. వైసీపీ అభ్యర్థి ఎచ్చెర్ల దివ్యాశ్రీధర్‌పై ఐదుఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసీపీ శ్రేణులకు నిరాశే మిగిలింది.

  • ఉన్నతాధికారుల పరిశీలన

  • జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్‌ కళాశాల, టెక్కలి ఐతం ఇంజనీరింగ్‌ కళాశాల, పలాస ప్రభుత్వ హైస్కూల్‌, పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో రాత్రి వరకూ లెక్కింపు సాగింది. ఆయా కేంద్రాలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌, ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు సూర్యతేజ తదితరులు పరిశీలించారు.

  • నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి : మంత్రి అచ్చెన్నాయుడు సూచన

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం పరిధిలో కూటమి ఘన విజయాన్ని నమోదు చేయడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో విజయోత్సాహం వెల్లివిరిసింది. గెలుపొందిన జడ్పీ టీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు.. శనివారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ విజ యానందాన్ని మంత్రితో పంచుకున్నారు. నాయకులు, కార్య కర్తలు పరస్పరం అభినందనలతో సంబరాలు చేసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు విజయం సాధించిన అభ్యర్థులం దరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు టీడీపీతో పాటు కూటమిపై ఉంచిన విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి జడ్పీటీసీ పూజారి శైలజ, కోటబొమ్మాళి-1,2 ఎంపీటీసీలు యమునారెడ్డి, సింహాద్రమ్మ, నౌపడ, సంతబొమ్మాళి -2 ఎంపీటీసీ వాడరేవు పద్మావతి పాల్గొన్నారు. BJR_4602.gifIMG-20261107-WA0628.gif

Updated Date - Nov 08 , 2026 | 01:20 AM