Share News

పలాసలో నిర్మించేది ఎయిర్‌పోర్టే

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:07 AM

పలాస నియోజ కవర్గంలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు చర్యలు వేగవం తం అవుతున్నాయని, ఇక్కడ నిర్మించేది కార్గో ఎయిర్‌ పోర్టు కాదని ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలో ఏపీ ఎయిర్‌పోర్టు డెవలెప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డీ ప్రవీణ్‌ఆదిత్యను కలిసి పలు అంశాలపై చర్చించారు.

పలాసలో నిర్మించేది ఎయిర్‌పోర్టే
ఏపీ ఎయిర్‌పోర్టు డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డీ ప్రవీణ్‌ఆదిత్యతో చర్చిస్తున్న ఎమ్మెల్యే శిరీష

  • ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పలాస నియోజ కవర్గంలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు చర్యలు వేగవం తం అవుతున్నాయని, ఇక్కడ నిర్మించేది కార్గో ఎయిర్‌ పోర్టు కాదని ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలో ఏపీ ఎయిర్‌పోర్టు డెవలెప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డీ ప్రవీణ్‌ఆదిత్యను కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడు తూ పలాసలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నారనే ఆపో హలు వ్యాప్తి చెందుతున్నాయని, ఇది ప్రజలు ప్రయా ణించేందుకు వీలుండే ఎయిర్‌పోర్టు అని స్పష్టం చేశారు. దేశంలో రైలు ప్రయాణ రద్దీని తగ్గిస్తూ అదే సమయంలో సామాన్య ప్రజలకు అందుబాటులో విమానయానం ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఉడాన్‌ పథకంలో భా గంగా వయాబులిటి గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎస్‌) విధా నంలో రెండేళ్లపాటు నేరుగా కేంద్ర ప్రభుత్వమే నిర్వ హణ బాధ్యతలు చేపడుతుందన్నారు. పలాస నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే సెకండ్‌ ఏసీ రైలు ప్రయాణి కుల వివరాలు ఇప్పటికే కేంద్రం సేకరించిందన్నారు. ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే దేశంలో ప్రధాన నగరాలైన చెన్నై, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్‌, ఢిల్లీ వంటి నగరాలకు విమానాలు నడిపే అవకాశం ఉంటుందన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోయే వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తుంద న్నారు. తొందరలోనే ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారుల బృందం నిర్మాణ ప్రాంతంలో సర్వే చేస్తుందని, ఆ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు స్పష్టం చేశారు. పదో తరగతి చదివిన నిరుద్యోగులకు కూడా ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని, దీనికి సంబంధించిన వివరాలు తొందరలోనే పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Feb 26 , 2026 | 12:07 AM