Share News

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ధ్యేయం

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:47 AM

ప్రజా సమస్య ల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసు కుంటోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ధ్యేయం
కేక్‌ కట్‌చేసి పంచిపెడుతున్న ఎంపీ కలిశెట్టి

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

జి.సిగడాం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్య ల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసు కుంటోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. ఆదివారం పెంట గ్రామంలో ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. గ్రామాలకు వచ్చి ప్రజా సమస్యలను తెలుసు కొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. అభివృద్ధి అంటే సీఎం చంద్రబాబునాయుడు అని, అటువంటి విజన్‌ ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రి చేయడం ఎంతో అభినంద నీయమన్నారు. 2047 నాటికి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మారడం ఖాయమన్నారు.

సీఎం చంద్రబాబు ముందస్తు పుట్టినరోజు

జి.సిగడాం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు జన్మదినవేడుకలను పెంట గ్రామం లో ఆదివారం నిర్వహించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేక్‌ కట్‌ చేసి పంచి పెట్టారు. సోమవారం చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు కుమరాపు రవి కుమార్‌, ముప్పిడి సురేష్‌, లంక శ్యామల రావు, బెండు మల్లేశ్వరరావు, నాయకులు డీజీఎం ఆనందరావు, పిన్నిం టి మనోజ్‌నాయుడు, లంక నారాయణరావు, బాలబొమ్మ వెంకటేశ్వరరావు, కుదిరిళ్ల బుజ్జి, నక్క మురళి కామోదుల సీతారాం తదితరులు పాల్గొన్నారు.

‘దేశాభివృద్ధిలో స్వీయ జనగణన కీలక పాత్ర’

రణస్థలం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధిలో స్వీయ జనగణన కీలకపాత్ర పోషిస్తుందని, దీనిపై అవగహన కలిగి ఉండి ప్రతి ఒక్కరూ వివరాలు నమోదు చేసుకోవాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం స్వీయ గణనకు సంబంధించిన తన కుటుంబ వివరాలను స్వీయగణన వెబ్‌సైట్‌లో స్వయంగా నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీయగణన ఈనెల 30 వరకు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరా లను సిబ్బందికి అందజేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సనపల కిరణ్‌కుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ మూర్తి పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 12:47 AM