అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతమే ధ్యేయం
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:07 PM
w
కవిటి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలు బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వం ఽధ్యేయమని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ తెలిపారు. ఆదివారం మునిపుట్టుగలో అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని ప్రారం భించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో చిన్నారులను తీర్చిదిద్దడమే కాకుండా, వారి ఆరోగ్యంపై శ్రద్ధచూపే కేంద్రాలుగా అంగన్‌వాడీలు ఉన్నాయన్నారు. భవన నిర్మాణానికి స్థలాన్ని అందించిన గ్రామానికి చెందిన సంధ్యారాణిని ఎమ్మెల్యే అశోక్ సత్కరిం చారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం ప్రాజెక్టు పీవో ఎం.రాజేశ్వరి, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మణిచంద్రప్రకాష్, పీఏసీఎస్ చైర్మన్ బాసుదేవ్ ప్రదాన్, నాయకులు పి.కృష్ణారావు, ఎస్‌వీరమణ, బి.రమేష్, సదానందరౌళో పాల్గొన్నారు.