Share News

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం: శంకర్‌

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:24 PM

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తు న్నామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం: శంకర్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తు న్నామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. సింగుపురంలో శుక్రవారం విలేకరులతో మాట్లా డుతూ.. 18 నెలల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్నామన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను దిగ్విజయంగా అమ లు చేస్తున్నామని, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం, ప్రాజెక్టు లు, రోడ్ల అభివృద్ధి, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందిస్తున్నామన్నారు. రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్‌ పుస్తకాల అందజేసి భూ సమస్య ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామంలో పలువురు రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నేతలు పీఎంజే బాబు, ఎంపీటీసీ పంగ సత్యనారాయణ, సింగుపురం సర్పంచ్‌ ఆదిత్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

రూ.20కే కిలో గోధుమపిండి: శంకర్‌

అరసవల్లి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): నాణ్యమైన గోధుమ పిండిని కేజీ రూ.20లకే అందించుందుకు చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. నగరంలోని పెద్దరెల్లి వీధిలో ప్రభుత్వ రేషన్‌ డిపో ద్వారా కార్డుదారులకు గోధుమ పిండి పంపిణీని శుక్రవారం ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:24 PM