మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం: ఎన్‌ఈఆర్
ABN , Publish Date - May 30 , 2026 | 11:35 PM
మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్విని యోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.
రణస్థలం, మే 30 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్విని యోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. శనివారం జీరుపాలేం తీరం వద్ద మెరైన్ ఫిష్ సీడ్ కార్యక్రమం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సముద్రపు చేపల విత్తనోత్పత్తి, పెంపకం కార్యక్రమాలు కేంద్ర సముద్ర మత్స్య పరి శోధన సంస్థ నిర్వహిస్తోదన్నారు. రానున్న రెండేళ్లలో బుడగుట్లపాలెంలో హార్బన్‌ను ప్రారంభించి వలస లను నివారిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.
మంత్రి సత్యకుమార్‌కు స్వాగతం
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీకా కుళం జిల్లాకు వచ్చిన నేపథ్యంలో శనివారం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వచ్చారు. ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధికి ఎన్‌ఈఆర్ చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి ప్రశం సించారు. కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం ఉపాఽధ్యక్షు రాలు నడుకుదిటి రజిని, యువత నేత నడు కుదిటి తేజాబాబు పాల్గొన్నారు.
‘పాడి రైతుల అభ్యున్నతికి కృషి’
జి.సిగడాం, మే 30 (ఆంధ్రజ్యోతి): పాడి రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) అన్నారు. శనివారం మండల కేం ద్రంలోని పశువైద్య కేంద్రం వద్ద ఎచ్చెర్ల మా ర్కెట్ కమిటీ, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో మెగా ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. రాయితీపై పశుపుష్టి, గడ్డి విత్తనాలు, గడ్డి పెం చేందుకు రాయితీలు ఇస్తోందని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి నేతలు, పశువైద్యులు పాల్గొన్నారు.