Share News

లెక్క తేలింది

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:17 AM

Final list of municipal candidates మునినిపాలిటీ ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. జిల్లాలో నవంబరు 1న పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు.

లెక్క తేలింది

మునిసిపాలిటీల్లో అభ్యర్థుల తుది జాబితా ప్రకటన

పలాస-కాశీబుగ్గ చైర్‌పర్సన్‌ రేసులో ఆరుగురు

బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు

పలాస, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): మునినిపాలిటీ ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. జిల్లాలో నవంబరు 1న పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి సంబంధించి చైర్‌పర్సన్‌ రేసులో ఆరుగురు ఉన్నారు. ఈ మునిసిపాలిటీలో కూటమి, వైసీపీ సభ్యుల మధ్య ప్రధాన పోటీ ఏర్పడింది. ఇప్పటికే రెండు పార్టీలు తమ తుది జాబితా విడుదల చేయగా, బుధవారం వారికి బీ-ఫారాలు అందజేశాయి. నామినేషన్లు ఉపసంహరణ కూడా జరగ్గా.. బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఆదివారం సాయంత్రం ఎన్నికల అధికారి, కమిషనర్‌ ఇ.శ్రీనివాసులు విడుదల చేశారు. 36 వార్డులకుగానూ కూటమిలో జనసేన నుంచి ఐదుచోట్ల, బీజేపీ నుంచి ఒకరు.. మిగిలిన 30 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే ఆరుగురు స్వతంత్య్ర అభ్యర్థులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. వారంతా టీడీపీ తరపున టిక్కెట్‌ ఆశించారు. ఆయా స్థానాలు జనసేనకు కేటాయించడంతో స్వతంత్య్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. నవంబరు 1వ తేదీన పోలింగ్‌, 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. తుది జాబితా ఖరారు కావడంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

చైర్‌పర్సన్‌ అభ్యర్థులు

వ జ్జ గంగాభవాని (టీడీపీ)

తాళాసు శ్రీపద్మ(వైసీపీ)

బద్రి సీతమ్మ (కాంగ్రెస్‌)

స్వతంత్రులుగా దువ్వాడ శ్రీజ, లక్ష్మిప్రధాన్‌, మన్యాల రమ్య

Updated Date - Oct 26 , 2026 | 12:17 AM