ఏసీఏ తప్పులను సరిదిద్దుకోవాలి
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:50 PM
ఆంధ్రా క్రికెట్ అసోసి యేషన్ (ఏసీఏ) చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలని జిల్లా క్రికెట్ సం ఘం అధ్యక్షుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ హెచ్చరిం చారు.
జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవికుమార్
శ్రీకాకుళం స్పోర్ట్స్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా క్రికెట్ అసోసి యేషన్ (ఏసీఏ) చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలని జిల్లా క్రికెట్ సం ఘం అధ్యక్షుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ హెచ్చరిం చారు. స్థానికంగా ఓ ప్రైవేట్ హోటల్‌లో శనివారం విలేకరులతో మా ట్లాడుతూ.. ఎవరో ఇచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని నేడు ఏసీఏ క్రికెట్ సెలక్షన్స్ జిల్లాలో నిర్వహించడం సరికాదన్నారు. ఇక్కడ ఎంపికలు చేసేందుకు మీకు ఎవరు అధికారం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు. వ్యవస్థను సరిది ద్దేందుకు బాధ్యతలు తీసుకున్నానని, ఎటువంటి పొరపాట్లు జరగనివ్వ నన్నారు. గత ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని క్రికెట్ సంఘం ఎన్నో పొర పాట్లు చేశారని, వాటిని సరిచేస్తానన్నారు. ఏసీఏ మోనార్క్‌గా ప్రవర్తిస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. సమావేశంలో క్రికెట్ సంఘం ప్రతిని ధులు హసన్‌రాజా, సువ్వారి రవికుమార్, బాలమురళి తదితరులు పాల్గొన్నారు.