12వ పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలి
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:51 PM
మూడేళ్లు దాటినా పీఆర్సీ కమిషనర్‌ను ఇంతవరకు నియ మించ లేదని, దీంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపో తున్నారని, తక్ష ణం తగు చర్యలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ బీవీవీఎన్ రాజు డిమాండ్ చేశారు.
సమస్యలపై పోరాటం
ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ బీవీవీఎన్ రాజు
అరసవల్లి, జూన్ 10(ఆంధ్ర జ్యోతి): మూడేళ్లు దాటినా పీఆర్సీ కమిషనర్‌ను ఇంతవరకు నియ మించ లేదని, దీంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపో తున్నారని, తక్ష ణం తగు చర్యలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ బీవీవీఎన్ రాజు డిమాండ్ చేశారు. నగరంలోని రెవెన్యూ భవన్‌లో సంఘం డివిజన్ చైౖర్మన్లు, ప్రధాన కార్యదర్శులు, మహిళా విభాగం చైర్మన్లు, కార్యదర్శులతో జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంట నే మధ్యంతర భృతిని ప్రకటిస్తామని చెప్పిందని, అయితే ఆ దిశగా నేటికీ ఎటువంటి చర్యలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులకు 2023 నుంచి 5శాతం మధ్యంతర భృతి చెల్లిస్తోందని గుర్తు చేశారు. ఐఆర్ ఇవ్వకపోవడంపై ఉద్యో గుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ప్రయోజనాల రక్షణకు జిల్లాలోని ఇతర ప్రధాన ఉద్యోగ సంఘా లను సంప్రదించి ఉద్యమ కార్యాచరణ చేపడతా మన్నారు. కార్యదర్శి రమణ మాట్లాడుతూ.. మారుతున్న ధరలకు అనుగుణంగా పే రివిజన్ చేపట్టాలని, గత నాలుగేళ్ల నుంచి సరెండర్ లీవ్ బకాయిలున్నాయని, తక్షణం వాటిని చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం మ్యాని ఫెస్టోలో ప్రభు త్వోద్యోగులకు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పదవీ విరమణ చేసిన వారి పెన్షన్‌ను 12 నుంచి 15 శాతానికి పెంచాలని కోరారు. ఈ సందర్భంగా ఇతర ఉద్యోగ సంఘాలతో సమన్వయం చేసేం దుకు గాను రాష్ట్రస్థాయి చైౖర్మన్‌గా టీవీ ఫణి పేర్రాజు, కన్వీనర్‌గా పలిశెట్టి దామోదరరావు, ఏపీ పీటీడీ ఆధ్వర్యంలో మరో 11 మందిని ఒక ఉద్య మ కార్యాచరణ కమిటీని ఏకగ్రీవంగా నియ మిం చారు. అనంతరం ఐక్య కార్యాచరణ ప్లెక్సీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.