Share News

కుమార్తె బతుకుతుందని..

ABN , Publish Date - May 04 , 2026 | 12:07 AM

కొత్తూరు మండలం చిన్నరా జపురం గ్రామానికి చెందిన సవర ఇల్లాంగు, జ్యోతి అనే గిరిజన దంపతులను హత్య చేసిన అదే గ్రామానికి చెందిన సవర తోటయ్యను ఆదివారం అరెస్టు చేసినట్లు కొత్తూరు సీఐ చింతాడ ప్రసాద్‌ తెలిపారు.

కుమార్తె బతుకుతుందని..
వివరాలు వెల్లడిస్తున్న సీఐ, ఎస్‌ఐ

- చిల్లంగి నెపంతో గిరిజన దంపతులను చంపేశాడు

- చిన్నరాజపురం ఘటనలో ఒకరి అరెస్టు

- వివరాలు వెల్లడించిన పోలీసులు

మెళియాపుట్టి (కొత్తూరు), మే 3 (ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలం చిన్నరా జపురం గ్రామానికి చెందిన సవర ఇల్లాంగు, జ్యోతి అనే గిరిజన దంపతులను హత్య చేసిన అదే గ్రామానికి చెందిన సవర తోటయ్యను ఆదివారం అరెస్టు చేసినట్లు కొత్తూరు సీఐ చింతాడ ప్రసాద్‌ తెలిపారు. ఈ వివరాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. తోటయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దకు మార్తెకి ఎప్పుడూ ఆరోగ్యం బాగోదు. ఎన్ని ఆస్పత్రులకు తీసుకెళ్లినా నయం కావడం లేదు. గ్రామానికి చెందిన ఇల్లాంగు చిల్లంగి పెట్టి ఉంటాడని అపోహ పడ్డాడు. ఇల్లాంగుని చంపితే తమ కూమార్తె బతుకుతుందని భావించాడు. ఈ నేపథ్యంలో పది రోజులు కిందట ఇల్లాంగుతో గొడవపడ్డాడు. దీనిపై ఇల్లాంగు బంధువులు వచ్చి తోటయ్యను నిలదీశారు. అప్పటి నుంచి మరింతగా కక్షపెట్టుకు న్నాడు. గత నెల 28న ఇల్లాంగును చంపడానికి గొడ్డలిని సిద్ధం చేసుకున్నాడు. వేసవి కావడంతో ఇంటి ముందు ఉన్న సిమెంట్‌ రోడ్డుపై భార్య జ్యోతితో కలిసి నిద్రిస్తున్న ఇల్లాం గుపై వేకువజామున 3 గంటల సమయంలో గొడ్డలితో దాడి చేశాడు. అడ్డుకున్న జ్యోతిపై కూడా గొడ్డలితో దాడి చేసి ఇద్దరినీ హతమార్చాడు. శబ్దం రావడంతో ఇంటి మేడపై నిద్రిస్తున్న ఇల్లాంగు పెద్దకుమారుడు కిసాయికి మెలకువ వచ్చింది. దీంతో జరిగిన సంఘటను చూశాడు. ఆ సమయంలో కేకలు వేస్తే తనను కూడా చంపుతాడనే భయంతో కిందకు దిగలేదు. ఉదయం తమ బం ధువులకు జరిగిన విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తోటయ్యను అరెస్టు చేసి కొత్తూరు న్యాయాధికారి ఎదుట హాజరుప ర్చినట్లు సీఐ ప్రసాదు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2026 | 12:07 AM