‘తమ్మినేని’ కుటుంబం భూకబ్జా హేయం
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:54 PM
బతికున్న వ్యక్తిని కాగితాల్లో చంపేసి రూ.4 కోట్ల విలువైన భూమిని స్వాహా చేసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ బాగోతం అత్యంత హేయమని విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు.
విజయనగరం ఎంపీ కలిశెట్టి
శ్రీకాకుళం, జూలై 20(ఆంధ్రజ్యోతి): బతికున్న వ్యక్తిని కాగితాల్లో చంపేసి రూ.4 కోట్ల విలువైన భూమిని స్వాహా చేసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ బాగోతం అత్యంత హేయమని విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్‌గా వ్యవహరించిన సీతారాం ఆ పదవికే తీవ్ర కలంళం తెచ్చారని విమర్శించారు. వైసీపీ పాలనలో నేతల అహంకా రం, భూదాహం ఏ స్థాయికి దిగజారాయో అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో వరుసగా బయటపడు తున్న కబ్జాల పర్వాలే ప్రత్యక్ష సాక్ష్యాలన్నారు. మైక్ దొరికితే నీతులు చెప్పే సీతారాం ఆచరణలో చేసింది మాత్రం భూకబ్జాలు, దౌర్జన్యాలు, పైరవీలు, అక్రమ కేసులేనన్నారు. స్పీకర్ స్థానంలో ఉండి ప్రతిపక్షాల మైక్ కట్ చేయడమే కాకుండా, అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. బయట రోడ్డు మీద రౌడీలా ప్రవర్తించా రని మండిపడ్డారు. విద్యార్హతలపై కూడా తప్పుడు ధ్రువీకరణ పత్రాలిచ్చి ఎన్నికల్లో నామి నేషన్ వేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మినేని.. రాజ్యాంగ వ్యవ స్థలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార గర్వంతో అధికారులను భయపెట్టి, ప్రతి పనిలోనూ కమీషన్లు దండుకుంటూ ఆమదాలవలస నియోజకవర్గ అభివృద్ధిని పాతాళానికి తొక్కేసిన తమ్మి నేని సీతారాం, ఆయన కుటుంబం చేసిన ప్రతి అక్రమం పై సమగ్ర విచారణ జరిపిస్తామని ఎంపీ స్పష్టం చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి, ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ప్రకారం కబ్జా కోరులందరినీ కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.