Share News

ప్రశాంతంగా టెట్‌ ప్రారంభం

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:50 PM

74 candidates absent on the first day ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లాలోని బుధవారం రెండు పూటలా నిర్వహించిన ఈ పరీక్షలకు 1,043 మంది అభ్యర్థులకు గాను 969 మంది హాజరయ్యారు. 74 మంది గైర్హాజరయ్యారు.

ప్రశాంతంగా టెట్‌ ప్రారంభం
చిలకపాలెంలోని కేంద్రంలో పరీక్ష రాసి బయటకు వస్తున్న అభ్యర్థులు

తొలిరోజు 74 మంది అభ్యర్థులు గైర్హాజరు

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లాలోని బుధవారం రెండు పూటలా నిర్వహించిన ఈ పరీక్షలకు 1,043 మంది అభ్యర్థులకు గాను 969 మంది హాజరయ్యారు. 74 మంది గైర్హాజరయ్యారు. ఉదయం నాలుగు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 565 మంది అభ్యర్థులకుగాను 530 మంది హాజరయ్యారు. చిలకపాలెంలోని శివానీ కళాశాలలో 100 మందికి 91 మంది, ఎచ్చెర్లలోని వెంకటేశ్వర కళాశాలలో 100 మందికి 95 మంది, నరసన్నపేట కోర్‌ టెక్నాలజీలో 320 మందికి 301 మంది, బరంపురంలోని ప్రభుత్వ పరిశ్రమల శిక్షణ కేంద్రంలో 45 మంది అభ్యర్థులకు 43 మంది పరీక్షలు రాశారు.

మధ్యాహ్నం మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 478 మందికి 439 మంది హాజరయ్యారు. వెంకటేశ్వర కళాశాలలో 58 మందికి 50 మంది, శివానీ కళాశాలలో 100 మందికి 91 మంది, నరసన్నపేట కోర్‌ టెక్నాలజీలో 320 మందికి 298 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు.

సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించడంతో మొదటిసారిగా రాస్తున్న కొందరు ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులు తడపడ్డారు. ఒడిశాలో పరీక్ష కేంద్రం కేటాయించిన అభ్యర్థుల్లో కొంతమంది మంగళవారం రాత్రే బరంపురానికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించారు. పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేశారు. పరీక్షా కేంద్రాలను నరసన్నపేట, ఎచ్చెర్ల, లావేరు, టెక్కలి ఎంఈవోలు పర్యవేక్షించారు. తొలిరోజు ఏడు కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతగా జరిగాయని డీఈవో రవిబాబు తెలిపారు.

Updated Date - Aug 05 , 2026 | 11:50 PM