తొలిరోజు ప్రశాంతం
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:29 AM
Tenth class exams begin పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 145 కేంద్రాల్లో రెగ్యులర్, తొమ్మిది కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు తెలుగు, ఒరియా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 28,637 మంది విద్యార్థులకుగాను 28,532 మంది హాజరయ్యారు.
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
28,532 మంది విద్యార్థుల హాజరు.. 105 మంది గైర్హాజరు
నరసన్నపేట/ శ్రీకాకుళం కలెక్టరేట్/గుజరాతీపేట, మార్చి 16(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 145 కేంద్రాల్లో రెగ్యులర్, తొమ్మిది కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు తెలుగు, ఒరియా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 28,637 మంది విద్యార్థులకుగాను 28,532 మంది హాజరయ్యారు. 105 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈవో ఏ.రవిబాబు తెలిపారు. జిల్లాలో తొమ్మిది ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 47 సిట్టింగ్ స్క్వాడ్‌ల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించామన్నారు. ఎటువంటి మాస్‌కాఫీయింగ్ జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని తెలిపారు. ఇదిలా ఉండగా, తొలి పరీక్ష కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారంతో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నరసన్నపేటలో దివ్యాంగ విద్యార్థులు తల్లిదండ్రులతో ఆగచాట్లు పడుతూ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. స్కైబ్ సహాయంతో దివ్యాంగులు పరీక్షలు రాశారు. కోమర్తికి చెందిన నక్క జాహ్నవి అనే దివ్యాంగ విద్యార్థిని తల్లి సుజాత ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు.
కలెక్టర్ పరిశీలన
శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన వసతులను పర్యవేక్షించారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించాలని, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిఘా ఉంచాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.