Share News

గోకర్ణపల్లిలో ఉద్రిక్తత

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:51 AM

గోకర్ణపల్లిలో పంచాయతీ ఎన్నికల నేప థ్యంలో ప్రచారం చేసుకుంటున్న సమయంలో టీడీపీ, వైసీపీ మద్దతుదాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

గోకర్ణపల్లిలో ఉద్రిక్తత
గొడవకు సంబంధించిన దృశ్యాలు డీఎస్‌పీకి చూపిస్తున్న ఎస్‌ఐ రాజేష్‌ :

పొందూరు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): గోకర్ణపల్లిలో పంచాయతీ ఎన్నికల నేప థ్యంలో ప్రచారం చేసుకుంటున్న సమయంలో టీడీపీ, వైసీపీ మద్దతుదాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అత్యంత సమస్యాత్మక గ్రామంగా ఉన్న గోకర్ణపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య స్వల్పవాదనల సమయంలో ఓ పార్టీకి చెందిన మద్దతుదారులపై రాళ్లు రువ్వడంతో పొన్నాడ భాస్కరరావు, ఎన్ని చిన్న వాడుకు గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని కుటుంబసభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పికెటింగ్‌లో ఉన్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో డీఎస్పీ ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో సీఐ సన్యాసినా యుడు, ఎస్‌ఐ రాజేష్‌, 50 మం ది వరకు బెటాలియన్‌ గ్రామా నికి చేరుకుని ప్రజలను ఇళ్ల ల్లోకి పంపించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే అప్రమత్తంగా ఉండాలని డీఎస్‌పీ పోలీసు అధికారులను ఆదేశించారు.

Updated Date - Nov 27 , 2026 | 12:51 AM