Share News

ఉద్రిక్తంగా ‘జైల్‌భరో’

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:46 PM

Arrest of 24 protesters కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సోమవారం శ్రీకాకుళంలో చేపట్టిన ‘జైల్‌భరో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. వివిధ ప్రజాసంఘాల నాయకులు స్థానిక కేంద్ర పన్నులు, ఆదాయ శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

ఉద్రిక్తంగా ‘జైల్‌భరో’
శ్రీకాకుళంలో ఆందోళన చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు

  • 24 మంది నిరసనకారుల అరెస్టు

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సోమవారం శ్రీకాకుళంలో చేపట్టిన ‘జైల్‌భరో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. వివిధ ప్రజాసంఘాల నాయకులు స్థానిక కేంద్ర పన్నులు, ఆదాయ శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కార్యాలయం లోపలకి వెళ్లేందుకు నిరసకారులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 24 మందిని అరెస్టు చేసి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ కేంద్రం రైతలుకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తోందని, కార్మికులకు కనీస వేతనం అందని ద్రాక్షగా మిగిలిందని, కార్మిక హక్కులను కాలరాస్తూ లేబర్‌ కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు. ‘పంటలకు మద్దతు ధర ప్రకటించడం లేదు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకం మార్పుతో పేదల కడుపు కొట్టింది. ప్రజా వ్యతిరేక విధానాలపై అందరూ ఐక్యంగా పోరాటాలు చేయాల’ని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, ఉపాధ్యక్షురాలు కె.నాగమణి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టి.తిరుపతిరావు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పొ ందూరు చంద్రరావు, పోలాకి ప్రసాదరావు, గంగారపు సింహాచలం, వెలమల రమణ, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, రెల్ల సురేష్‌, కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి, అల్లు సత్యన్నారాయణ, ఏ రాజు, ఏ రామస్వామి, టి ప్రవీణ పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 11:46 PM