ఆధ్యాత్మిక చింతనకు ఆలయాలు దోహదం
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:47 PM
ఆధ్యాత్మిక చింతనకు ఆలయాలు దోహదం చేస్తాయని ప్రముఖ ప్రవ చనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు.
ప్రముఖ ప్రవచనకర్త ‘చాగంటి’
ఎచ్చెర్ల, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక చింతనకు ఆలయాలు దోహదం చేస్తాయని ప్రముఖ ప్రవ చనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. జిల్లాకు వచ్చిన ఆయన శుక్ర వారం తమ్మినాయుడుపేట అమ్మా సంస్థాన్‌ను సందర్శించారు. నాగావళి నదీ తీరాన ఉన్న లలితా దేవి చంద్ర మౌళీశ్వర స్వామి, దక్షిణామూర్తి ఆల యాలను దర్శించుకున్నారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ.. మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి ఆలయం అరుదుగా చూస్తుంటామన్నారు. గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేశారు. నదీ తీరాన ఆలయం ఉండడం వల్ల ప్రశాం తంగా ఉంటుందన్నారు. ఆలయ ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు, ప్రధాన అర్చకుడు సురేష్ శర్మ పూర్ణకుంభం తో ఆయనకు స్వాగతం పలికారు.