కార్యకర్తలకు అండగా తెలుగుదేశం పార్టీ: ఎమ్మెల్యే మామిడి
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:45 PM
: కార్యకర్తలకు ఎల్లవేళలా టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం, జూన్ 6(ఆంధ్రజ్యోతి): కార్యకర్తలకు ఎల్లవేళలా టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. కొరసవాడ గ్రామానికి చెందిన సుమారు 150 కుటుంబాలు శనివారం వైసీపీని వీడి... టీడీలో చేరాయి. స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వారికి టీడీపీ కండువాలను వేసి ఆహ్వానించారు. మాజీ ఉపసర్పంచ్ అమర శ్రావణి, అమర రామ్మోహన్ మొర్రి రామకృష్ణ, పల్ల ఆదినారాయణ, పల్ల సరస్వతి, బతకల బాలాజీ, పల్ల బాబూరావు యాదవ్, చెల్లబోయిన తాతయ్య తదితరులు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమ, మ్మెల్యేగా మామిడి గోవిందరావు నాయకత్వ పటిమకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్టు చెప్పారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచితస్థానం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.
రాజముద్రతోనే పాసు పుస్తకాలు..
పాతపట్నంరూరల్/పాతపట్నం, జూన్ 6(ఆంధ్రజ్యోతి): నాయకుల ఫొటోలు లేకుండా కేవలం రాజముద్రతోనే పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శనివారం కోదూరులో ఎమ్మెల్యే రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో పాసు పుస్తకాలపై సీఎం జగన్ చిత్రపటం ఉండడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తప్పులను సవరించి ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్‌లతో వీటిని రూపొందించారని తెలిపారు. అనంతరం ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన వివిధ సమస్యలకు పరిష్కారం చూపుతానన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు, ఎంపీడీవో హెచ్‌వీ రమణమూర్తి, పీఏసీఎస్ అధ్యక్షుడు బండి రవివర్మ, టీడీపీ నాయకులు పైల బాబ్జీ, సైలాడ సతీష్, తదితరులు పాల్గొన్నారు.