ఐపీఎల్‌లో టెక్కలి కుర్రోడు
ABN , Publish Date - May 18 , 2026 | 12:05 AM
ఇండియన్ ప్రీమియం లీగ్ (ఐసీఎల్)లో ఢిల్లీ జట్టుకు ఎంపికైన టెక్కలికి చెం దిన ఆఫ్ స్పిన్నర్ త్రిపురాన విజయ్ ఆదివారం రాజ స్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగేట్రం చేశా డు.
ఢిల్లీ తరఫున తొలి మ్యాచ్ ఆడిన విజయ్
టెక్కలి, మే 17(ఆంధ్రజ్యోతి): ఇండియన్ ప్రీమియం లీగ్ (ఐసీఎల్)లో ఢిల్లీ జట్టుకు ఎంపికైన టెక్కలికి చెం దిన ఆఫ్ స్పిన్నర్ త్రిపురాన విజయ్ ఆదివారం రాజ స్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగేట్రం చేశా డు. విజయ్ ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలోనే ఐదో ఓవర్ బౌలింగ్ చేయగా.. సూర్యవంశీ కొట్టిన షాట్‌ను లాంగ్ ఆఫ్‌లో ఢిల్లీ జట్టు ఫీల్డర్ మాధవ్ క్యాచ్ వదిలేశాడు. ఈ మ్యాచ్‌లో విజయ్ రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. కాగా రూ.30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్ ప్రాంచైజీ విజ య్‌ను కొనుగోలు చేసింది. విజయ్ బౌలింగ్‌కు కామెం టేటర్లు వ్యవహరిస్తున్న ఎంఎస్‌కే ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. మొత్తంగా టెక్కలికు చెందిన యువకుడు ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ ఆడడంపై విజయ్ తల్లిదం డ్రులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.