రైల్వేగేట్‌లో సాంకేతిక సమస్య
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:19 AM
టెక్కలిలో గల రైల్వేగేట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో రెండు రోజులుగా ప్రజలకు ఇబ్బందిపడుతున్నారు.
టెక్కలి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): టెక్కలిలో గల రైల్వేగేట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో రెండు రోజులుగా ప్రజలకు ఇబ్బందిపడుతున్నారు. బుధ వారం రాత్రి ఈ సమస్య ఏర్పడడంతో గేట్లు తెరుచుకోలేదు. గురువారం రైలు వచ్చే సమయంలోను ఇదే సమస్య ఉత్పన్నం కావడంతో ఇరువైపుల రాకపో కలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. రైల్వే సిబ్బంది తాత్కాలిక రాడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. ప్రధాన రోడ్డులో ఈ సమస్య ఏర్పడడంతో రాకపోకలకు సమస్యగా మారింది. రైల్వే అధికారులు వెంటనే స్పందించి సాంకేతిక సమస్య సరిచేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.