అగ్నివీర్’డుకి కన్నీటి వీడ్కోలు
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:20 AM
బావిలో మునిగి మృతి చెందిన మజ్జిల పేటకి చెం దిన సోద రులు మొజ్జాడ విష్ణు, రామ కృష్ణపై గ్రామ యువత,
‘పొందూరు, ఆ గస్టు 18(ఆంధ్రజ్యోతి): బావిలో మునిగి మృతి చెందిన మజ్జిల పేటకి చెం దిన సోద రులు మొజ్జాడ విష్ణు, రామ కృష్ణపై గ్రామ యువత, స్నేహితులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. మృతదేహాలతో వచ్చిన అంబులెన్సును జాతీయ జెండాలు పట్టుకుని బైక్‌లతో ర్యాలీ చేపట్టి ఘన నివాళి అర్పించారు. ఇటీవల అగ్నివీర్ ఉద్యోగానికి ఎంపికై ఆరు నెలల శిక్షణ పొంది ఈనెల 23న ఉద్యోగంలో చేరాల్సి ఉన్న మొజ్జాడ రామకృష్ణ మృతి చెందడంతో సైనిక లాంఛనాలతో అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహంపై జాతీయజెండాను ఉంచి సైనిక వందనం చేశారు. అమరవీరుడు రామకృష్ణ జోహార్ అంటూ నినదించారు. మృతుల తల్లిదండ్రులు వరలక్ష్మి, అసిరినాయుడులను ఓదార్చి అండగా ఉంటామని సైనికాధికా రులు భరోసా కల్పించారు. అనంతరం అంత్యక్రియలు చేపట్టారు. కార్యక్రమంలో వందలాది మంది గ్రామ స్థులు, యువకులు పాల్గొని సోదరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ విషాదకర వాతావరణం నెలకొంది.