Share News

విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులు ఉపాధ్యాయులు

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:58 PM

విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని, ఉద్యోగ ధర్మంతోపాటు సామాజిక ధర్మాన్ని పాటించాలని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ పోతుల బాలకోటయ్య అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులు ఉపాధ్యాయులు
మాట్లాడుతున్న బాలకోటయ్య

ఏపీ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ బాలకోటయ్య

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని, ఉద్యోగ ధర్మంతోపాటు సామాజిక ధర్మాన్ని పాటించాలని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ పోతుల బాలకోటయ్య అన్నారు. ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా గురువారం శ్రీకాకుళం పెద్దపాడు డా.బీఈఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలను పరిశీలించారు. సంక్షేమశాఖ అధికారులు, గురుకుల అధ్యాపకులతో సమీక్ష నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారి పరిపాలన ఎంతో ముఖ్యమని, అధికారులు బాధ్యతాయుతమైన పనితీరు అలవర్చుకోవాలని సూచించారు. తరగతి గదులను పరి శీలించి విద్యార్థులతో మాటా-మంతీ నిర్వహించారు. విద్యార్థుల సమస్యలు, విద్యాభ్యాసం, వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు ప్రేమతో కలిపి పెట్టిన అన్నం ముద్దను స్వీకరిం చారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కె.వినాయకం. జిల్లా కో ఆర్డినేటర్‌ వై.యశోదలక్ష్మి, ప్రిన్సిపాల్‌ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి దర్శించుకున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 11:58 PM