ఉపాధ్యాయుల సర్దుబాటు కొలిక్కి
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:26 AM
గత పదిహేను రోజుల నిరీక్షణ అనంతరం మండల స్థాయిలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ బుధవారం కొలిక్కి వచ్చింది.
- సీనియర్టీ జాబితా విడుదల
- నేడు డివిజన్ స్థాయిలో కౌన్సెలింగ్
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, జూలై 8(ఆంధ్రజ్యోతి): గత పదిహేను రోజుల నిరీక్షణ అనంతరం మండల స్థాయిలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ బుధవారం కొలిక్కి వచ్చింది. మిగులు టీచర్ల సీనియారిటీ జాబితాను రాష్ట్ర విద్యాశాఖ ఐటీ సెల్ అధికారులు విడుదల చేశారు. దీంతో వీరికి మండల కేంద్రాల్లో ఎంఈవోల ఆధ్వర్యంలో బుధవారం కౌన్సెలింగ్ చేపట్టగా 80శాతం మేరకు ఎస్జీటీ పోస్టులు సర్దుబాటు అయ్యాయి. 20 శాతం సర్‌ప్లస్ పోస్టులు మిగిలిపోవడంతో వీరికి డివిజనల్ స్థాయిలో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి వందల సంఖ్యలో డివిజనల్ స్థాయిలో సర్దుబాటు కావాల్సి ఉంది. నరసన్నపేట మండలాన్ని పరిశీలిస్తే 16 పోస్టులు ఖాళీగా ఉండగా, 11 మందిని మండల స్థాయిలో సర్దుబాటు చేశారు. అదనంగా ఉన్న ఐదుగురు ఉపాధ్యాయులు డివిజన్ స్థాయిలో కౌన్సెలింగ్‌కు హాజరు కానున్నారు. గురువారం నాటికి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేస్తామని డీఈవో రవిబాబు తెలిపారు.