జంటపట్టణాల్లో ఉపాధ్యాయిని ఆత్మహత్య
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:07 AM
జంట పట్టణాల్లోని మారుతీనగర్ నివాసముంటున్న హిందీ ఉపాధ్యాయిని పడాల రోహిణి(47) ఆత్మహత్య చేసుకున్నట్లు కాశీబుగ్గ సీఐ రామకృష్ణారావు తెలిపారు. మూడురోజుల కిందట తన నివాసంలో ఉరిపోసుకోగా శనివారం రాత్రి ఆమె మృత దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు.
పలాస,జూన్ 27(ఆంధ్రజ్యోతి): జంట పట్టణాల్లోని మారుతీనగర్ నివాసముంటున్న హిందీ ఉపాధ్యాయిని పడాల రోహిణి(47) ఆత్మహత్య చేసుకున్నట్లు కాశీబుగ్గ సీఐ రామకృష్ణారావు తెలిపారు. మూడురోజుల కిందట తన నివాసంలో ఉరిపోసుకోగా శనివారం రాత్రి ఆమె మృత దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. సీఐ కథనం మేరకు.. మెళియాపుట్టి మండలంలోని తూముకొండకు చెందిన రోహిణి పలాస ప్రభుత్వోన్నత పాఠశాల లో హిందీ ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. ఆమె భర్త జీవనరావు విజయనగరంలో జీఎస్‌టీశాఖలో పనిచేస్తున్నారు. రోహిణి కి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా వారు వేరే ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. రోహిణి భర్త విజయనగరంలో విధులు నిర్వహిస్తూ మూడునాలుగు రోజులకోసారి ఇంటికి వచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని విధులకు వెళ్లిపోతుంటారు. ఈక్రమంలో శనివారం ఆయన ఇంటికి రాగా రోహిణి ఉరి పోసుకొని ఉండడం కనిపించడంతో కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఆత్మహ త్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలం వద్ద శవాన్ని సీఐ రామ కృష్ణ స్వాధీనం చేసుకొని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలిం చారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.