టీడీపీకి కార్యకర్తలే మార్గదర్శకులు
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:09 AM
టీడీపీకి మార్గదర్శకులు కార్యకర్తలేనని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): టీడీపీకి మార్గదర్శకులు కార్యకర్తలేనని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తే అధినేత కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో సమావేశాన్ని గురు వారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచే కర్యకర్తలే పార్టీకు నిజమైన పట్టు కొమ్మలని అన్నారు. పార్టీ అధిష్ఠానం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మై టీడీపీ యాప్‌లో పార్టీ నిర్దేశించిన అంశాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకలాపాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెంది పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.