మహిళా సాధికారతకు కేరాఫ్ టీడీపీ
ABN , Publish Date - May 29 , 2026 | 11:46 PM
మహి ళా సాధికారత కేవలం మాటలకే పరి మితం చేయకుండా చేతల్లో చూపెట్టిన పార్టీగా టీడీపీ చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బగ్గు అర్చన అన్నారు.
33 శాతం రిజర్వేషన్ల నిర్ణయం చారిత్రాత్మకం
టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బగ్గు అర్చన
అరసవల్లి, మే 29(ఆంధ్రజ్యోతి): మహి ళా సాధికారత కేవలం మాటలకే పరి మితం చేయకుండా చేతల్లో చూపెట్టిన పార్టీగా టీడీపీ చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బగ్గు అర్చన అన్నారు. స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లా డుతూ.. మహిళలకు రాజకీయ స్వేచ్ఛ, సముచిత స్థానం కల్పిస్తూ చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించేలా మహా నాడులో పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా ప్రజాసేవలో భాగస్వా ములయ్యేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. గతంలో మహిళలకు ఆస్తి హక్కు దగ్గర నుంచి విద్య, ఉద్యో గాల్లో 33 శాతం రిజర్వేషన్లు, తొలి మహిళా స్పీకర్ నియా మకం, డ్వాక్రా సం ఘాల ఏర్పాటు తదితర ఘనతలన్నీ చంద్రబాబు నాయుడు కే దక్కుతాయన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్రంలో 12 లక్షల డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసి 1.12 కోట్ల మందికి ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పిస్తున్నా మన్నారు. మహిళలు, చిన్నారుల జోలికి వస్తే క్షమించేది లేదని, వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలి పారు. దాడులు, వేధిం పులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. ఈ సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షు రాలు పిరియా మాధవి, నేతలు కవ్వాడి సుశీల, కవిత, పద్మావతి, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.