బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు టీడీపీ కృషి
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:54 PM
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కృషి చేస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్
శ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 10 (ఆంధ్ర జ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కృషి చేస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శనివారం టీడీపీ జిల్లా కార్యాల యంలో విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కోర్టును ఆశ్రయించడం చూస్తుంటే ఆ పార్టీకి బీసీలపై ఉన్న చిత్తశుద్ధి ఎంతో అర్థం చేసుకోవచ్చన్నారు. 1983లో ఎన్టీ ఆర్ టీడీపీని స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు బీసీల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ పనిచేస్తోందన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, నేతలు కలగ జగదీష్, పీఎంజేబాబు పాల్గొన్నారు.