కార్యకర్తలకు అండగా టీడీపీ: ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:50 PM
టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందని విజయనగరం ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు అన్నారు.
జి.సిగడాం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందని విజయనగరం ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు అన్నారు. ఇటీవల అకాల మరణం చెందిన జగన్నాథ వలసకి చెందిన టీడీపీ కార్యకర్త మచ్చ శ్రీనివాస రావు కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ కుటుంబ నిధి నుంచి రూ.5 లక్షల చెక్కును శ్రీనివాసరావు భార్య లక్ష్మికి అందజేశారు.
అలాగే ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న ధవళపేట మాజీ సర్పంచ్ కంచరాన సూరన్నాయుడును ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసు కున్నారు. కార్యక్రమంలో రైల్వే బోర్డు సలహా సంఘ సభ్యుడు బాలబొమ్మ వెంటేశ్వరరావు, టీడీ పీ నేతలు కుమరాపు రవికుమార్, బెవర జగ న్నాఽథరావు, పంచిరెడ్డి బంగారినాయుడు, రాములు తదితరులు పాల్గొన్నారు.
‘భక్తిభావాలు పెంపొందించుకోవాలి’
లావేరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): భక్తి భావాలను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవా లని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. ధర్మ పరిరక్షణలో భాగంగా మహారాష్ట్ర వాసిం జిల్లా, మాల్గావేకి చెందిన కొందరు యాత్రీకులు మహారాష్ట్ర నుంచి ఒడిశా రాష్ట్రం పూరీకి పాదయాత్రగా వెళుతుండగా లావే రు మండలం సుభద్రాపురం జంక్షన్ వద్ద హైవే పై ఆదివారం అటుగా వెళ్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వారిని కలిసి వివరాలు తెలుసు కున్నారు. ధర్మ పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి అభినందించారు. జై శ్రీరామ్ నినాదంతో వారి తో కలిసి కొంతదూరం నడిచారు.