కార్యకర్తలకు అండగా టీడీపీ: ఎమ్మెల్యే
ABN , Publish Date - May 15 , 2026 | 12:20 AM
కార్యకర్తలకు ఎల్లవేళలా టీడీిపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
పాతపట్నం/ఎల్‌ఎన్‌పేట, మే 14 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తలకు ఎల్లవేళలా టీడీిపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎల్‌ఎన్‌పేట మండలం ఆర్‌ఎండ్‌ఆర్ శ్యామలాపురంలోని 195 కుటుంబాలు, పాతపట్నం మండలం మాకివలస గ్రామంలోని 85 కుటుంబాలు వైసీపీని వీడి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో గురువారం టీడీపీలో చేరాయి. శ్యామలాపురం గ్రామానికి గేదెల జగన్మోహనరావు, సుంకు రమేష్, మాజీ సర్పంచ్ రేగాన మోహనరావు, మాజీ వార్డు సభ్యుడు రాజాపు ధర్మారావు, విద్యాకమిటీ చైర్మన్ లక్ష్మీనారా యణతో పాటు 120కుటుంబాలు, ఎల్‌ఎన్‌పేటకు చెందిన విద్యాకమిటీ చైర్మన్ కరగాన పోలయ్యతోపాటు 75కుటుంబాలు చేరాయి. పార్టీ విధానాలతో పాటు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నాయకత్వంపై నమ్మకంతో టీడీపీలో చేరుతున్నట్టు వారు ప్రకటించారు. పాతపట్నం మండలం మాకివలస గ్రామానికి చెందిన గేదెల హైమావతి, గేదెల శ్రీనివాసరావు, మాజీ వార్డు సభ్యురాలు గేదెల ఆరుద్రమ్మతో కలసి 85 కుటుంబాలు టీడీపిలో చేరాయి. బూత్ పరిశీలకులు పుచ్చ ఈశ్వరరావుతోపాటు మండల నాయకులు సారథ్యం వహించారు. పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలను వేసి ఎమ్మెల్యే స్వాగతించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్...
పాతపట్నం/హిరమండలం, మే 14 (ఆంధ్రజ్యోతి): వివిధ వర్గాల వారి సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామనిఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తాగునీరు, మౌలిక సౌకర్యాలను కోరుతూ ఎక్కువ మంది వినతులు అందించారు. వివిధ రకాల పింఛన్లు, గృహాల కోసం మరికొంతమంది పింఛన్లు అందించారు. అనంతరం హిరమండలం మండలం పాత హిరమండలం గ్రామంలోని తోట జయంతి ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమె కుటుంబ సభ్యులు నిరుపేదలు కావడంతో వారి ఇంటికి వెళ్లి... కుటుంబీకులకు రూ.2 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పి.బుచ్చిబాబు, మండల టీడీపీ అధ్యక్షులు దారుపు ఢిల్లేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షులు గోళ్ల సింహాచలం, నీటి సంఘం అధ్యక్షులు చెట్టు శ్రీనువాసరావు, సావుకారి గోవిందరావు, లాడె కృష్ణ, యాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.