ప్రతి ఇంటికి కొళాయి నీరు
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:20 AM
వచ్చే ఎన్నికలు నాటికి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందిస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు
నందిగాం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికలు నాటికి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందిస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం నందిగాం, క్రిష్ణ రాయపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారం భోత్సవం, శంకుస్థాపన నిర్వహించారు. నందిగాం ఎస్సీ కాలనీలో రూ.12.5లక్షలు, శివాలయం వద్ద రూ.5లక్షలు, స్వామిపేటలో రూ.20లక్షలతో నిర్మిం చిన సీసీ రోడ్లును ప్రారంభించారు. అలాగే రూ.1.37 కోట్లతో కణితివూరు నుంచి హరిదాసు పురం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నా యుడు మాట్లాడుతూ.. టెక్కలి నియోజకవర్గం లోని 425 గ్రామాలకు హిరమండలం రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైపులైన్ల ద్వారా తాగునీరు అంది స్తామన్నారు. దీనికి సంబంధించి మొదటి విడతగా రూ.100కోట్లు మంజూరయ్యాయని, రెండో విడత లో విడుదలైన నిధులతో ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా చేపట్టడం జరుగుతుందన్నారు. 2029 నాటికి టెక్కలి నియోజకవర్గాన్ని మోడ ల్‌గా తీర్చిదిద్దుతానన్నారు. పదిమందికి ఉప యోగపడే పనులు చేపట్టడమే మా లక్ష్యమని, ఇందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నా 18 నెలల్లో ఇచ్చిన హామీల ను ఒక్కొక్కటిగా నెరవేర్చామన్నారు. కొత్తగా అర్హులైన వృద్ధుల కు, వితంతువులకు పెన్షన్లు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసు కుంటుందని తెలిపారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, పీఆర్ ఈఈ సూర్యప్రకాష్, ఈఈ సుధాకర్, ఏడీఏ జగన్మోహనరావు, టీడీపీ నాయకులు పి.అజయ్‌కుమార్, పి.చంద్రశేఖర్, ఎం. బాలకృష్ణ, ఎస్.జానకిరాం తదితరులు పాల్గొన్నారు.