Share News

ప్రభుత్వ లక్ష్యసాధన దిశగా చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:07 AM

ప్రభుత్వ లక్ష్య సాధన దిశలో ప్రత్యే కాధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ కోరారు.

ప్రభుత్వ లక్ష్యసాధన దిశగా చర్యలు తీసుకోండి
ప్రత్యేకాధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

కవిటి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ లక్ష్య సాధన దిశలో ప్రత్యే కాధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ కోరారు. రామయ్యపుట్టుగలో బుధవారం ఇచ్ఛాపురం నియోజక వర్గ స్థాయి పంచాయతీ ప్రత్యేకాధి కారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయ తీల్లో ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా చూడాలన్నారు. రాష్ట్రప్రభుత్వం పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని, దీనికి ప్రత్యేకాధికారులు సహకరించాలన్నారు. వేసవి లో తాగునీటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల న్నారు. వీధిలైట్ల నిర్వహణపై దృష్టి సారించాల న్నారు. సమావేశంలో తహసీల్దార్లు, ఎంపీడీ వోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 12:07 AM