Share News

సాగునీరందేందుకు చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:19 AM

అన్ని గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న పొలాల కు సాగునీరందించేలా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ అన్నారు.

 సాగునీరందేందుకు చర్యలు తీసుకోండి
ఆమదాలవలస: ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): అన్ని గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న పొలాల కు సాగునీరందించేలా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ అన్నారు. మంగళవారం పట్టణం లోని తన క్యాంప్‌ కార్యాలయంలో వివిధ విభాగాలకు చెందిన నీటి పారుదలశాఖాధి కారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన నీటిపారుదల ప్రాజెక్టుల పురో గతి, కాలువల మరమ్మతులు, పూడికతీత వాటి నిర్వ హణ, చెరువులు పునరుద్ధరణ తదితర అంశా లపై ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో సాగుకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో నీరందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో నారాయణపురం ప్రాజెక్టు చైర్మన్‌ సనపల ఢిల్లీశ్వర రావు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ పి.సుధాకర్‌, వంశధార ఈఈ రవీంద్రబాబు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

‘రైతుల ప్రయోజనమే లక్ష్యం’

పొందూరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రైతులకు ప్రయోజనం చేకూర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. తండ్యాం గ్రామం లో మంగళవారం ‘అన్నదాత సుఖీభవ’ నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, కూట మి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందన్నారు. తండ్యాం ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కె.భాస్కరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఎ.రాము, పార్టీ నేతలు ఎస్‌. శ్రీరంగ నాయుకులు బలగ శంకర భాస్కర్‌, ఖండాపు శ్రీనివాసరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు వి.మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:19 AM