తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:13 AM
వేసవి దృష్ట్యా నియోజకవర్గం పరిధిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష సూచించారు.
అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): వేసవి దృష్ట్యా నియోజకవర్గం పరిధిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష సూచించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం స్థానిక టీడీపీ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం, రోడ్ల నిర్మాణం అంశాలపై చర్చించారు. రాబోయే వేసవిలో ఒక్క గ్రామంలో కూడా తాగునీటి సమస్య ఉండకూడదన్నారు. అవసరమైతే తాగునీటి పథకాలకు మరమ్మతులు చేసి, వేసవికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
అప్రమత్తంగా ఉండండి
జిల్లా కేంద్రంలో ప్రస్తుతం డయేరియా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గౌతు శిరీష సూచించారు. గ్రామా ల్లో మురుగుకాలువల నిర్వహణ, తాగునీటి పథకాలను పరిశుభ్రంగా ఉంచాల న్నారు. ప్రజారోగ్యంపై అలసత్వం వహిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. స మావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ సూర్యనారాయణ, ఆర్‌అండ్‌బీ జేఈ విక్రమ్, జగదీష్, పంచాయతీరాజ్ డీఈఈ జి.రవిబాబు పాల్గొన్నారు.
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్యాన్ని మొరుగుపరిచి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపు నిచ్చారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చెత్తసేకరణ, పారిశుధ్య నిర్వహణ కోసం 13 రిక్షాలు, ఒక ట్రక్, రెండు ట్రాక్టర్లను నగర పంచాయతీకి అందజేసి మాట్లాడారు. గ్రామాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేష్ ప్రసాద్, రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, పొందర కురాకుల కార్పొరేషన్ చైర్మన్ దామోదర నర సింహులు, నాయకులు జామి వెంకటరావు, గొద్దు చిట్టిబాబు, బోయన సతీష్, కింజరాపు రామారావు, అడపా చంద్రశేఖర్, సరియపల్లి మధు, నేతింటి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
క్రీడాభివృద్ధికి రూ.2.41 కోట్లు
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): నియోజక వర్గ పరిధిలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం రూ.2,41,79,813 సీఎస్‌ఆర్ నిధులు చేసినట్టు ఎమ్మెల్యే మామిడి గోవిం దరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియో జవకర్గంలోని పరిస్థితులను కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడి దృష్టికి తీసుకువెళ్లగా.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఈ నిధులతో నియోజకవర్గం లో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. క్రీడాకాలకు అవసరమయ్యే ఆధునిక శిక్షణ సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.