గణేష్ నిమజ్జనాల్లో జాగ్రత్తలు తీసుకోండి
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:59 PM
గణేష్ నిమజ్జనాల సమయంలో సమయపాలన పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సీహెచ్ వివేకా నంద అన్నారు. ఈ మేరకు బుధవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
డీఎస్పీ వివేకానంద
శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గణేష్ నిమజ్జనాల సమయంలో సమయపాలన పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సీహెచ్ వివేకా నంద అన్నారు. ఈ మేరకు బుధవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవా లన్నారు. మందిరాల వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసుకోవా లని, అనుమతి లేకుండా డీజేలు వినియోగించరాద న్నారు. నిమజ్జనం సమయంలో చిన్నారులను నీటి ప్రాం తాలకు దూరంగా ఉంచాలని సూచించారు. కార్యక్ర మంలో సీఐ పైడిపునాయుడు, వన్‌టౌన్ ఎస్‌ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ బాక్సులు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టూటౌన్ సీఐ ఈశ్వరరావు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను బుధవారం నిమజ్జనం చేశారు. టూటౌన్ సీఐ పి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు హేమంత్ కుమార్, హైమావతి పర్యవేక్షణలో సిబ్బంది గణేషుని విగ్ర హాన్ని ఊరేగింపుగా తీసుకు వచ్చి నాగావళి నదిలో నిమజ్జనం చేశారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజ లు చేపట్టారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.