Share News

ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Jul 27 , 2026 | 11:56 PM

మునిసిపాలిటీ ఆదాయం పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని టౌన్‌ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సీహెచ్‌ చామంతి కోరారు.

   ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోండి
సచివాలయం వద్ద చేపట్టే నిర్మాణాలను అడిగితెలుసుకుంటున్న చామంతి:

పలాస, జూలై 27(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ ఆదాయం పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని టౌన్‌ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సీహెచ్‌ చామంతి కోరారు. సోమవారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని ఐడీఎస్‌ఎంటీ షాపింగ్‌ కాంప్లెక్స్‌, సచివాలయ భవనాలు పరిశీలించారు. జంటపట్టణాల్లో అక్రమంగా వేసిన లేఅవుట్లు, అనుమ తులు పొందిన లేఅవుట్లు పరిశీలించారు. రాజీవ్‌గాంధీ బస్టాండ్‌, సచివాలయంపైన శ్లాబ్‌లు వేసి ఎందుకు విడిచిపెట్టారని, ఐడీఎస్‌ఎంటీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఇంకా అనేక షాపులు అద్దెలకు ఎందుకు ఇవ్వలేదని కమిషనర్‌ ఇ.శ్రీనివాసులను ప్రశ్నించా రు. పలాస ప్రభుత్వాసుపత్రి ఆవరణ , కాశీబుగ్గ సంత మైదానంలోని సచివాలయాల ద్వారా ఆదాయం వచ్చేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

Updated Date - Jul 27 , 2026 | 11:56 PM