మునిసిపల్ ఎన్నికలకు చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:07 AM
మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. ఈ మేరకు కమిషనర్ శ్రావణ్ కుమార్‌తో కలిసి మునిసిపల్ శాఖ మంత్రి నారాయణను గురువారం అమరావతిలో వినతిపత్రం అందించా రు.
మంత్రి నారాయణకు ఎమ్మెల్యే శంకర్ వినతి
శ్రీకాకుళం అర్బన్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. ఈ మేరకు కమిషనర్ శ్రావణ్ కుమార్‌తో కలిసి మునిసిపల్ శాఖ మంత్రి నారాయణను గురువారం అమరావతిలో వినతిపత్రం అందించా రు. ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా ఉన్న ప్రస్తుత కోర్టు కేసులను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి వాటిని త్వరితగతిన పరిష్కరించి ఎన్నికలకు మార్గం సుగమం చేసేందుకు ఉన్న అవకాశలను పరిశీలిం చాలని కోరారు. కార్పొరేషన్ పాలన మెరుగుదలకు ఎమ్మెల్యే తీసుకున్న చొరవను కమి షనర్ మంత్రికి వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించి సంబం ధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మంత్రి నారా లోకేష్‌ను కలిసిన శంకర్
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌ను ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం మర్యాదపూర్వకంగా కలి శారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో జరుగుతున్న అభి వృద్ధి కార్యక్రమా లు, విద్యాశాఖకు చెందిన అంశాలపై మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.