ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:24 PM
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీ క్షలు రాయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు.
అరసవల్లి/ కోటబొమ్మాళి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీ క్షలు రాయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. ఈ మేరకు వారి క్యాంపు కార్యాలయాలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. పదో తరగతి ఉజ్వల భవిష్యత్‌కు నాంది అని, మంచి మార్కులు సాధిం చాలని సూచించారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. వేసవి దృష్ట్యా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, తగిన నిద్ర, మంచి సమతుల ఆహారం తీసుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని కోరారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా, విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి స్వయంగా డీఈవోతో ఫోన్‌లో మాట్లాడి పదో తరగతి ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అధికారులు సమన్వ యంతో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు.