శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకోండి
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:44 PM
ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ శిక్షణా తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌సీఈఆర్‌టీ రాష్ట్ర పరిశీలకుడు సుజనాకుమార్ అన్నారు.
ఎస్‌ఈఆర్‌టీ రాష్ట్ర పరిశీలకుడు సుజనాకుమార్
కంచిలి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ శిక్షణా తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఈఆర్‌టీ రాష్ట్ర పరిశీలకుడు సుజనాకుమార్ అన్నారు. కంచిలి ఉన్నత పాఠశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న శిక్షణా తరగ తులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణలో తెలుపుతున్న నూతన అభ్యసన పద్ధతులు, మెలకువలను క్షేత్రస్థాయిలో అమలు చేసి లక్ష్యా లను నెరవేర్చాలన్నారు. కోర్సు డైరెక్టర్లు, ఎంఈవోలు శివరాంప్రసాద్, చిట్టిబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాలమేరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రైవేటు స్కూళ్లలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠ శాలల్లో చేర్పించేలా కృషి చేస్తున్నామన్నారు. మండలంలో ఉపాధ్యాయుల కొరత, బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా మార్పు తదితర సమస్య లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఐఈ కోఆర్డినేటర్ పి.కాశీవిశ్వనాథ్, జిల్లా కోఆర్డినేటర్ బి.రాజేశ్వరరావు, ఎంఆర్‌సీ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.