శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:04 AM
క్రీడా సంఘాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి శిక్షణ పొందాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం స్పోర్ట్స్, జనవరి 4(ఆంధ్రజ్యోతి): క్రీడా సంఘాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి శిక్షణ పొందాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల మైదానంలో కింజరాపు ఎర్రన్నాయుడు మెమోరియల్ పేరిట క్రికెట్ అరీనాను ఆదివారం ఆయన ప్రారంభించారు. నెట్స్‌లో వేసిన టర్ఫ్ వికెట్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో భారత మహిళలు ప్రపంచకప్ పోటీల్లో విజేతగా నిలవడంతో ప్రపంచం మన వైపు చూసేలా చేశారన్నారు. క్రికెట్ టర్ఫ్‌లను వినియోగించు కుని మంచి క్రీడాకారులుగా ఎదగాలన్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఇద్దరు కోచ్‌లను ఏర్పాటు చేశారని, వారి ద్వారా శిక్షణ పొందాలన్నారు. ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలోని బాస్కె ట్‌బాల్ అభివృద్ధికి జిల్లా క్రికెట్ అసోసియేషన్ రూ.50 వేలు చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్య క్రమంలో ఏసీఏ ప్రతినిధి నాగ గంగాధర్, దుప్పల వెంకట రావు, పూర్వపు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పి.సురేఖ, సీహెచ్ విజయభాస్కర్, క్రికెట్ సంఘం ప్రతినిధులు సువ్వారి రవికుమార్, ఇలియాస్ మహ్మద్, శైలానీ, పాండ్రంకి శంకర్ తదితరులు పాల్గొన్నారు.