Share News

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:13 AM

ఉద్దానంలో కిడ్నీ వ్యాధితోపాటు ఇతర ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్య క్షుడు డా.పూడి కిరణ్‌ కుమార్‌ కోరారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి
పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు వినతిపత్రం ఇస్తున్న కిరణ్‌కుమార్‌

కంచిలి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో కిడ్నీ వ్యాధితోపాటు ఇతర ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్య క్షుడు డా.పూడి కిరణ్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు సోమవారం కొర్లకోట గ్రామా నికి వచ్చిన పీసీసీ అధ్యక్షు రాలు వైఎస్‌ షర్మిలను కలిసి వినతిపత్రం అందించారు. కిడ్నీ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రతీ కుటుంబానికి రక్షిత తాగునీటిని అందించాలని, కొబ్బరి పంటకు సోకిన తెగుళ్ల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. కిడ్నీ వ్యాధిగ్రస్థుల కోసం డయాలసిస్‌ కేంద్రాలను పెంచి ఆదుకోవాలని కోరారు. సమస్యలపై ఆమె సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చినట్లు కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Mar 17 , 2026 | 12:13 AM