నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:59 PM
ఎంపీటీసీల నామినేషన్‌లు స్వీకరించే ఆర్వో కార్యాలయం వద్ద నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాయిం ట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు.
జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్
పొందూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీల నామినేషన్‌లు స్వీకరించే ఆర్వో కార్యాలయం వద్ద నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాయిం ట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. ఎంపీడీవో కార్యా లయంలో ఏర్పాటు చేసిన రిట ర్నింగ్ అధికారి కార్యాలయం, ఎంపీ టీసీ అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. నామినేషన్ దాఖలు కు వచ్చిన అభ్యర్థులతో జేసీ మాట్లాడి నామి నేషన్‌ల స్వీకరణ, అధికారుల వ్యవహార తీరు ను అడిగి తెసుకున్నారు. నామినేషన్‌లు వేసేం దుకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, గొడవలు, కొట్లాటలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నామి నేషన్ స్వీకరణ కేంద్రాన్ని హెల్ప్‌డెస్క్ కేంద్రాన్ని శ్రీకాకుళం ఆర్‌డీవో సాయి ప్రత్యూష పరిశీలించారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి సూర్యప్రకాశరావు, తహసీల్దార్ ఆర్.వెంకటేష్, ఎంపీడీవో వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.